ప్రేమ జంట ఆత్మహత్య....

మంచిర్యాల జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Update: 2024-03-13 15:26 GMT

దిశ, మంచిర్యాల టౌన్: మంచిర్యాల జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం , మంచిర్యాల జిల్లా మందమర్రి మం మామిడి గట్టుకి చెందిన నాంపల్లి సంగీత (23) నేన్నెల మండలం చిత్తపూర్ గ్రామానికి చెందిన తీగుళ్ల భగవాన్ (23) గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరు ఇరువురు దగ్గరి బంధువులు కావడంతో ఇంట్లో విషయం చెప్పి పెళ్లి చేసుకునేందుకు పెద్దలను ఒప్పించే క్రమంలో చిన్న మనస్పర్థలు వచ్చాయి. దీంతో బుధవారం ఉదయం సంగీత భగవాన్‌కు ఫోన్ చేసినట్లు తెలుస్తుంది.

అదే క్రమంలో ఇరువురి మధ్య కాస్త గొడవ జరగడంతో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి సంగీత ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయింది. విషయం తెలుసుకున్న భగవాన్ సంగీత చావును తట్టుకోలేక పురుగుల మందు తాగి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇరువురి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.పెళ్లి కావాల్సిన ఇద్దరు ఒకసారి ఆత్మహత్య చేసుకొని మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయాలు అలుముకున్నాయి.


Similar News