బెల్లంపల్లి ప్రజల చిరకాల కల సాకారం..
బెల్లంపల్లి ప్రజల చిరకాల కల సహకారమైందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం
దిశ,బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రజల చిరకాల కల సహకారమైందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. బెల్లంపల్లికి ఎల్లంపల్లి నీటి సరఫరా పథకానికి ఇవాళ అమృత్ 2.0 పథకం నిధులు రూ.6.5 కోట్ల తో బెల్లంపల్లి మిషన్ భగీరథ పంప్ హౌస్ వద్ద మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఆవిష్కరణ సభలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడారు. బెల్లంపల్లి ప్రజల తాగునీటి బాధలు చిరకాల కోరిక తీర్చేందుకే సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడి నీటి పథకాన్ని మంజూరు చేపించానన్నారు. దశాబ్దాల కాలంగా బెల్లంపల్లి ప్రజలు తాగునీటి కి ఇబ్బంది పడుతున్నారన్నారు. గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. అడ ప్రాజెక్ట్ నుంచి సరఫరా అవుతున్న తాగునీరు పూర్తిగా కలుషిత మైందన్నారు. ఈ నీటితో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని వాపోయారు.
బెల్లంపల్లి ప్రజలకు రక్షిత మంచినీటిని పథకాన్ని చేపట్టాలనే సంకల్పంతో అమృత్ 2.0 రూ.61.5 కోట్లతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని బెల్లంపల్లి కి తీసుకోవడం కోసం చేపట్టిన భారీ నీటి పథకమని తెలిపారు. త్వరగా నీటి ప్రాజెక్టు పనులు పూర్తిచేసి బెల్లంపల్లి ప్రజలకు మంచి నీటిని అందించాలని అధికారులను ఆదేశించారు. కొద్ది రోజుల్లో బెల్లంపల్లి ప్రజలు తాగునీటి బాధల నుంచి విముక్తి అవుతారని అన్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో తాగునీటి బాధలకు కాలం చెల్లిందన్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బెల్లంపల్లి ప్రజలు తాగునీటి బాధలు లేకుండా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఎల్లంపల్లి తాగండి పథకంతో బెల్లంపల్లి ప్రజలకు సురక్షితమైన మంచి నీటిని అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, ఆర్డీవో హరికృష్ణ, మున్సిపల్ కమిషనర్ కే శ్రీనివాసరావు, మిషన్ భగీరథ అధికారులు గంగాధర్, మధుకర్, తహసిల్దారు జ్యోత్స్న మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.