విద్యార్థులకు కనీస పరిజ్ఞానం ఉండాలి
అన్ని రకాల సబ్జెక్టులు, భాషలపై విద్యార్థులకు కనీస పరిజ్ఞానం ఉండాలని ఎఫ్.ఎల్.ఎన్ రాష్ట్ర మానిటరింగ్ సభ్యులు పోరెడ్డి అశోక్ అన్నారు.
దిశ, లోకేశ్వరం : అన్ని రకాల సబ్జెక్టులు, భాషలపై విద్యార్థులకు కనీస పరిజ్ఞానం ఉండాలని ఎఫ్.ఎల్.ఎన్ రాష్ట్ర మానిటరింగ్ సభ్యులు పోరెడ్డి అశోక్ అన్నారు. సోమవారం లోకేశ్వరం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలను ఎఫ్ఎల్ఎన్ రాష్ట్ర మానిటరింగ్ బృందం సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులకు విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
విద్యా సంవత్సరం ముగిసే సమయం ఆసన్నమైనందున ప్రణాళిక బద్దంగా విద్యార్థులను పరీక్షలకు సిద్ధమయ్యేలా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి చంద్రకాంత్ స్టేట్ మానిటరింగ్ బృందం సభ్యులు నారాయణ వర్మ, ప్రతాప్, పి.వి రవి గౌడ్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.