యువత సామాజిక సేవా ముందుండటం అభినందనీయం : ఎమ్మెల్యే పాయల శంకర్

సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన క్రమంలో యువత వింత పోకడలతో మునిగి

Update: 2024-07-06 12:55 GMT

దిశ,ఆదిలాబాద్ : సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన క్రమంలో యువత వింత పోకడలతో మునిగి తేలుతున్న క్రమంలో వాటికి అలవాటు పడకుండా సామాజిక సేవలో ముందుండటం అభినందనీయమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శనివారం స్థానిక ఆదిత్య ఖండేకర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబులెన్స్ సర్వీసును ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. రోగుల సౌకర్యార్థం అంబులెన్స్‍ను ఏర్పాటు చేయడం వారి సమాజ సేవకు నిదర్శనం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు ఆదిత్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం, పలువురు యువకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పిల్లలకు మంచి విద్యను అందించాలి : ఎమ్మెల్యే పాయల శంకర్

వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడిప్పుడే అన్ని విధాల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, ఇందులో భాగంగానే బేల మండల కేంద్రంలో ఎంజేపీ గురుకుల పాఠశాలను ప్రారంభించుకోవడం జరిగిందని అందులో విద్యార్థులకు మంచి విద్యను అందించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మండల ప్రత్యేక అధికారి, గురుకులం ఆర్సీఓతో కలిసి శనివారం పాఠశాలను ప్రారంభించారు. మహాత్మజ్యోతిభ పూలే గురుకులం ప్రారంభించిన అనంతరం ఆర్టీఓ గోపీచంద్ గురుకులం గురించి వివరించారు. ఇప్పటి వరకు తొంబై శాంతం పనులు పూర్తి చేశారని, కొన్ని మౌలిక వసతులు, పనులు పూర్తి కాలేదనే విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ బేల మండల కేంద్రానికి మహాత్మా జ్యోతిబా పూలే గురుకులం గతంలోనే మంజూరు కావడం జరిగిందని తెలిపారు. కానీ ప్రభుత్వ స్థలం లేక దీని ఆదిలాబాద్ లోనే కొనసాగించారాని పేర్కొన్నారు. గురుకులం సిబ్బంది పిల్లల భవిష్యత్ ను దృష్టిలో పెట్టి మంచి చదువును అందించాలని కోరారు. కొంత మేరకు మౌలిక వసతుల సమస్యలు ఉన్నాయి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని పేర్కొన్నారు. ఇందులో పలువురు ప్రజా ప్రతినిధులు మండల నాయకులు తదితరులు ఉన్నారు.


Similar News