ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం దహేగాం

Update: 2024-10-04 14:42 GMT

దిశ ,కాగజ్ నగర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం దహేగాం మండలంలోని బిబ్ర గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు సరఫరా చేయడం లేదని శుక్రవారం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. గ్రామంలోని ఎస్సీ కాలనీకి కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి నీటి సరఫరా లేకపోవడంతో విషయాన్ని ఎంపీడీవో కు సమాచారం తెలిపినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆగ్రహానికి గురైన కాలనీ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ దళితులు అంటే చిన్నచూపు అని ప్రశ్నించారు.

కొన్ని రోజుల నుండి గ్రామానికి నీటి సరఫరా జరగడం లేదని సంబంధిత గ్రామ కార్యదర్శి విషయాన్ని తెలియజేసిన పట్టించుకోలేదన్నారు. బి బ్రా గ్రామంలో ని మిషన్ భగీరథ నీళ్లు సరఫరా చేసిన అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రామంలో పైపులైన్లు సరిగా లేకపోవడంతో ఎస్సీ కాలనీ కి నీళ్లు రావడం లేదన్నారు. ఎన్నిసార్లు అధికారులకు సమస్యను విన్నవించిన పట్టించుకున్న దాఖలాలు లేవు అన్నారు. దళితులుగా పుట్టడమే తప్ప అంటూ నిరసన తెలిపారు. గ్రామానికి నీటి సరఫరా ఇవ్వకపోతే దళిత సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, గణపతి, జూమ్మిడిప్రకాష్, దుర్గం సావిత్రి, దుర్గం తిరుపతమ్మ, జుమ్మడి,విజయ జిమ్మిడి, జమున, సేవంత, గ్రామ పెద్దలు, మహిళలు, పలువురు పాల్గొన్నారు.


Similar News