అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు...

మండల కేంద్రంలోని స్థానిక 15వ వార్డులో మాజీ ఎంపీటీసీ సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు షేక్ రజియా బేగం ఆధ్వర్యంలో ఇంటింటా తిరుగుతూ ఇందిరమ్మ ఇండ్ల సర్వే చేయించారు.

Update: 2024-12-29 13:22 GMT

దిశ, బోథ్ : మండల కేంద్రంలోని స్థానిక 15వ వార్డులో మాజీ ఎంపీటీసీ సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు షేక్ రజియా బేగం ఆధ్వర్యంలో ఇంటింటా తిరుగుతూ ఇందిరమ్మ ఇండ్ల సర్వే చేయించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ షేక్ రజియా బేగం మాట్లాడుతూ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్, ఇన్చార్జి మంత్రి సీతక్క సహాయ సహకారాలతో పార్టీలకు అతీతంగా ప్రభుత్వం అర్హులైన ప్రతి పేదవాడికి దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరుగుతుందని, ఇందిరమ్మ రాజ్యంలోనే ప్రతి పేదవాడి సొంతింటి కల సాకారం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ అంజయ్య, మణికంఠ, అన్వేష్, తదితరులు పాల్గొన్నారు.


Similar News