అక్రమంగా తరలిస్తున్న దేశీదారు పట్టివేత...
మహారాష్ట్ర నుండి అక్రమంగా తరలిస్తున్న దేశీదారు మద్యాన్ని మంగళవారం రాత్రి రెబ్బెన పోలీసులు పట్టుకున్నారు.
దిశ, ఆసిఫాబాద్ : మహారాష్ట్ర నుండి అక్రమంగా తరలిస్తున్న దేశీదారు మద్యాన్ని మంగళవారం రాత్రి రెబ్బెన పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై చంద్ర శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం కాగజ్నగర్ ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా కాగజ్ నగర్ వైపు నుండి కారులో అక్రమంగా తరలిస్తున్న 18 దేశి దారు మద్యం కాటన్ లను పోలీసులు పట్టుకున్నారు. మార్కెట్లో దేశి దారు మద్యం బాటిల్స్ విలువ సుమారు రూ.61,200 విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు. మద్యాన్ని తరలిస్తున్న కారును సీజ్ చేసి, కాగజ్ నగర్ కు చెందిన రాజశేఖర్ గౌడ్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.