ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలి
విద్యార్థులు ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు.
దిశ, ఆసిఫాబాద్ : విద్యార్థులు ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ బాలుర పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలోని రికార్డులు, వంటగది, నిత్యావసర సరుకులను పరిశీలించారు. తరగతి గదిలో విద్యార్థులను పలు సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు అడిగి వారి ప్రతిభను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు అందించే భోజన మెనూ వివరాల పై ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనం ఇవ్వడంతో పాటు ఉత్తమ ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు.