డిజిటల్ మీడియాలో దిశకు ప్రత్యేక స్థానం
నియోజకవర్గ కేంద్రంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయ ఆవరణలో సీఐ వెంకటేశ్వరరావు చేతుల మీదుగా దిశ 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
దిశ, బోథ్ : నియోజకవర్గ కేంద్రంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయ ఆవరణలో సీఐ వెంకటేశ్వరరావు చేతుల మీదుగా దిశ 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల వ్యవధిలోనే దిశ తెలుగు దినపత్రిక డిజిటల్ మీడియా రంగంలో ప్రథమ స్థానంలో ఉందని, అనతి కాలంలోనే దిశ తెలుగు దినపత్రిక ప్రజల మన్ననలను పొందిందన్నారు. ప్రజా సమస్యలను నిరంతరం అధికారుల, పాలకుల దృష్టికి తీసుకొని వెళుతూ వాటి పరిష్కారానికి దిశ పాటుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గొర్ల రాజు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.