ఎల్లమ్మ తల్లికి బోనాలు

మండలంలోని కమల్ కోట్ గ్రామంలో బుధవారం ఎల్లమ్మ తల్లికి భక్తులు బోనాలు సమర్పించారు.

Update: 2025-01-01 10:26 GMT

దిశ, మామడ : మండలంలోని కమల్ కోట్ గ్రామంలో బుధవారం ఎల్లమ్మ తల్లికి భక్తులు బోనాలు సమర్పించారు. బెల్లం పానకంతో ప్రత్యేకంగా తయారు చేసిన బోనాలను నెత్తిన ఎత్తుకొని బంతిపూలు మెడలో ధరించి, పోతరాజుల నాట్య విన్యాసాలు, డప్పు వాయిద్యాలతో ఆలయం వద్దకు ఊరేగింపుగా తరలివచ్చారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఎల్లమ్మకు బోనాలు సమర్పించారు.

     పూజారుల ఆధ్వర్యంలో పట్నాలు వేసి ప్రత్యేక మొక్కులు చెల్లించుకుని తమ కుటుంబాలు చల్లంగా చూడాలని ఎల్లమ్మ తల్లిని వేడుకున్నారు. జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామస్తులు అన్ని ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు, మహిళలు, యువకులు, చిన్నారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


Similar News