అవగాహన లోపం.. కార్మికులకు శాపం..
మండల కేంద్రంలోని భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ లేబర్ కార్డు ఉపయోగాల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
దిశ, బోథ్ : మండల కేంద్రంలోని భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ లేబర్ కార్డు ఉపయోగాల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసంఘటిత, కార్మిక రంగాలలో పనిచేసే కార్మికులకు ఆపద సమయంలో అక్కున చేర్చుకునేది లేబర్ కార్డు ఈ కార్డు అన్ని రకాలుగా కార్మికులకు ప్రయోజనాలు చేకూర్చుతుంది. లేబర్ కార్డు కలిగిన కార్మికులు సహజ మరణం చెందితే లక్ష 30 వేల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుందని, అదే విధంగా ప్రమాదవశాత్తు పనిచేస్తున్న క్రమంలో మరణిస్తే ఆరు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుందన్నారు. ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఒక్కొక్కరికి వివాహ ఖర్చుల నిమిత్తం 30 వేల రూపాయలు ప్రభుత్వం వారి తరఫున బ్యాంకులో డిపాజిట్ చేస్తుందన్నారు.
ప్రతి సంవత్సరం కార్మికులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే కార్మికుల కోసం రక్షణగా ఉండేదే ఈ లేబర్ కార్డు. మండలంలో కొన్ని వేల మంది కార్మికులు కార్మిక రంగంలో పని చేస్తుంటే కేవలం కొన్ని వందల మందికి మాత్రమే ఈ కార్డు ఉంది. ఈ కార్డు ప్రయోజనాలు తెలియక చెప్పేవారు లేక అవగాహన లోపంతో దూరం అవుతున్న భవన నిర్మాణ కార్మికులు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం కార్మికులకు లేబర్ కార్డు ప్రయోజనాలను కార్మికులకు తెలిసే విధంగా సదస్సులు, సమావేశాలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కార్పె శ్రీనివాస్, ఇప్ప శ్రీనివాస్, తిరుపతి, ఆరే రమేష్, ఆరేపల్లి రాజేశ్వర్, తదితరులు ఉన్నారు.