ఉన్నత స్థానానికి ఎదగాలి
చదువులో రాణించి ఉన్నతంగా ఎదగాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బోజ్జు పటేల్ అన్నారు.
దిశ, ఉట్నూర్ : చదువులో రాణించి ఉన్నతంగా ఎదగాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బోజ్జు పటేల్ అన్నారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని చాందూరి గ్రామానికి చెందిన కురిసెంగ శివాజీ అనే గిరిజన అంద విద్యార్థి చదువులో రాణించేందుకు ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తాని కలిసి విన్నవించారు. దాంతో స్పందించిన పీఓ విద్యార్థి మొబైల్ ట్యాబ్ ను మంజూరు చేయగా ఎమ్మెల్యే చేతుల మీదుగా విద్యార్థికి దానిని అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చదువుకు వైకల్యం అడ్డు రాదన్నారు. చదువుపై ఉన్న దృఢ సంకల్పం జీవితంలో ఉన్నతమైన స్థానంలో ఉంచుతుందన్నారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా తనని కలిసి విన్నవించవచ్చని సూచించారు. కాగా న్యూ ఇయర్ సందర్భంగా కార్యకర్తలు, అధికారులు విసెస్ చెప్పేందుకు ఎమ్మెల్యే వద్దకు తరలి వచ్చారు. పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు, దుప్పట్లను ఎమ్మెల్యే కు అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.