కలెక్టర్ ఆదేశాలను పాటించని అధికారులు, పాలకులు..
ప్రతి నెలలో మొదటి శనివారం, మూడో శనివారం మండలంలోని మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులతో ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించిన విషయం తెలిసిందే.
దిశ, చింతలమానేపల్లి : ప్రతి నెలలో మొదటి శనివారం, మూడో శనివారం మండలంలోని మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులతో ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మొదటి శనివారం సమావేశాన్ని చింతలమానేపల్లి మండలంలోని బాలాజీ అనుకోడా రైతువేదికలో ఎంపీడీవో రేణిగుంట్ల మహేందర్, ఎంపీపీ డుబ్బుల నాన్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి అధికారులు, సర్పంచులు కొందరు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ హాజరు కాలేకపోయారు. రెండో సమావేశం మూడవ ఆదివారం అయినా అధికారులు ప్రజాప్రతినిధులు హాజరవుతారో, కాదో వేచిచూడాల్సి ఉంది.
ఈ సమావేశంలో ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామపంచాయతీ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని సర్పంచులతో మాట్లాడి నేషనల్ ప్లాన్ తయారు చేసుకోవాలన్నారు. మిషన్ అంత్యోదయ క్యాప్స్ సర్వే నిర్వహించుకోవాలన్నారు. ప్రతి ఇంట్లో మరుగుదొడ్లను పరిశీలించాలని, ఒక్క ఇంకుడు గుంత ఉన్న ఇళ్ళను సర్వే చేయాలని, నీటి సమస్యలను పరిష్కరించాలన్నారు. దళిత బంధు సర్వే నిర్వహించాలని ఈనెల 25 లోపు దళిత బంధు సర్వే, మిషన్ అంత్యోదయ సర్వే పూర్తి చేయాలన్నారు. జియో ట్యాకింగ్ ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని తెలిపారు. రెట్రో పిట్స్ సర్వే లను వచ్చేనెల 15 వరకు సర్వే పూర్తికావాలన్నారు. ప్రతి గ్రామాలలో తెలంగాణ క్రీడాప్రాంతాలను యువకులు ప్రోత్సహిస్తూ ఎక్సర్సైజ్ పరికారాలను ఏర్పాటు చేయాలన్నారు.
నర్సరీలోని మొక్కలను పెంచడంలో జాగ్రత వహించాలని తెలిపారు. ప్రతి స్కూల్లో, ప్రతి తరగతి గదిలో ఫ్యాన్లులను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాలలో సమస్యలను సకాలంలో పూర్తి చేయాలి, మొదటి సమావేశం కాబట్టి కొందరు అధికారులు ప్రజాప్రతినిధులు హాజరు కాలేకపోయారన్నారు. గ్రామాలలో సమస్యల పరిష్కారం కాకపోయినప్పుడు ఎంపీపీ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ గోవర్ధన్ సింగ్, ఏపీఎం రాజు యాదవ్, సీనియర్ అసిస్టెంట్ పెంటూ, పంచాయతీ సెక్రెటరీలు, వైద్యాధికారులు, అంగన్వాడి సిబ్బంది, ఎంపీటీసీ ధనరాజ్, వైస్ ఎంపీపీ, విద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.