ఇష్టారాజ్యంగా ఇసుక అక్రమ రవాణా..

ఇసుక మాఫియా రోజు రోజుకు రెచ్చిపోతుంది.

Update: 2025-03-17 06:58 GMT

దిశ,సిరికొండ : ఇసుక మాఫియా రోజు రోజుకు రెచ్చిపోతుంది. అక్రమంగా రవాణా మండల పరిధిలోని వాగులు వంకలు ప్రాంతాల్లో కొందరు స్వార్ధపరులు అక్రమార్కుల చర్యల కారణంగా స్వరూపాన్ని కొల్పొతున్నావి అని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దాన్ని అరికట్టాల్సిన అధికారులు అదేమి పట్టనట్టు వ్యవహరించడం వల్ల ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా అక్రమ ఇసుక రవాణా ను అరికట్టాల్సిన రెవెన్యూ అటవీ శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మండల ప్రాంతంలో వాగులు వంకలు నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమ సాగుతున్నట్లు బహిరంగ ఆరోపణలు వస్తున్నాయి. గతంలో రాత్రివేళల్లో మాత్రమే అక్రమ రవాణా సాగిస్తున్న అక్రమార్కులు ప్రస్తుతం మరింత బరితెగించి ఉదయం వేళల్లోనే ట్రాక్టర్లను ఏర్పాటు చేసి ఇసుక తవ్వకాలు చేస్తున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఉదయం వేళల్లోనే 4 గంటల నుండి ఇసుక రహస్య ప్రదేశాల్లో డంప్ చేసుకొని అక్కడి నుంచి రాత్రివేళల్లో ఇతర ప్రాంతాలకు ట్రాక్టర్ల ద్వారా అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అధికంగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతుండడంతో ఇసుక కేకు అక్కడ డిమాండ్ ఏర్పడింది. ఇక్కడి ఇసుక నాణ్యమైనది గా ఉండడంతో అక్రమార్కులు రెచ్చిపోయి పెద్ద ఎత్తున అక్రమ రవాణా చేస్తున్నట్లు విమర్శలు ఆరోపణలు వస్తున్నాయి.అటవీ శాఖ అధికారుల అండదండలతో ఇసుక అక్రమ రవాణా కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఠంచనుగా అందుతున్న మామూళ్లు తో అధికారులు అక్రమ ఇసుక రవాణా పై దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. అసలే అంతంత మాత్రంగా భూగర్భ జలాలు ఉండగా ఇసుక అక్రమ రవాణా కారణంగా భూగర్భ జలాలు మరింత అడుగంటిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. సామాన్యులు ఇళ్ల నిర్మాణాలకు ఇసుక అవసరం వస్తే సవాలక్ష నిబంధనలు చెప్పే వారు అధికారులు ఇసుక అక్రమ రవాణా దారుల విషయంలో మాత్రం నోరు మెదపకుండా చోద్యం చూస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి ఇప్పటికైనా సంబంధిత అధికారులు యంత్రాంగం వీటిపై చర్యలు తీసుకోవాలి.


Similar News