ఎలాంటి అనారోగ్యం లేని అమ్మాయి నిద్రలో ఎలా చనిపోతుంది ?
బోథ్ నియోజకవర్గంలోని ఇచ్చోడ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలిక చిక్రం లాలిత్య ఆకస్మికంగా చనిపోయిన విషయాన్ని సోమవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రస్తావించారు.

దిశ, ప్రతినిధి నిర్మల్ : బోథ్ నియోజకవర్గంలోని ఇచ్చోడ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలిక చిక్రం లాలిత్య ఆకస్మికంగా చనిపోయిన విష యాన్ని సోమవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రస్తావించారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ అధికారులు ఏదో దాచిపెడుతుకున్నారని, ఎలాంటి సమస్యలు లేని అమ్మాయి నిద్రలో ఎలా చనిపోతుందని ప్రశ్నించారు. ఆసుపత్రిలో పాము కాటు అంటున్నారని, అధికారులు నిద్రలో చనిపోయిందంటున్నారని నిలదీశారు. ఈ విషయంపై ఎవరికీ పట్టింపు లేదని అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దీనిపై శ్రద్ద చూపి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఎవీ ?
కాంగ్రెస్ ప్రభుత్వం విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు అన్యాయం చేస్తుందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆరోపించారు. విదేశీ విద్యపై అసెంబ్లీలో సోమవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం పేద, దళిత, గిరిజన విద్యార్థులకు పైచదువుల కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్లు మంజూరు చేసిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు విదేశాల్లో చదువుల కోసం రూ.25 లక్షలు ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇవ్వడం లేదని, ప్రభుత్వం వెంటనే ఓవర్సీస్ స్కాలర్షిప్లు మంజూరు చేయాలని కోరారు.