సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు

అల్లర్లు జరిగిన ప్రాంతంలో ప్రజలు సంయమనం పాటించాలని, ఆందోళనలు చేపట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం అన్నారు.

Update: 2024-09-04 13:37 GMT

దిశ, ఆదిలాబాద్ : అల్లర్లు జరిగిన ప్రాంతంలో ప్రజలు సంయమనం పాటించాలని, ఆందోళనలు చేపట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. మంగళవారం జైనూర్ లో జరిగిన ఘటనపై బుధవారం స్పందించిన ఆయన సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తప్పు చేసిన వారిపై పోలీసు యంత్రాంగం కేసులను నమోదు చేసిందని, దర్యాప్తు కొనసాగుతుందని, కారకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

     సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని కోరారు. వదంతులను ప్రచారం చేస్తూ, మతాల మధ్య చిచ్చుపెట్టే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాపై జిల్లా పోలీసు యంత్రాంగం నిఘా ఏర్పాటు చేసిందని, నిజా నిజాలు తెలుసుకోకుండా ప్రచారం చేసిన వారిపై, వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జైనూర్ లో 144 సెక్షన్ అమలులో ఉందని, ఇతర ప్రాంతాల వారికి అక్కడ అనుమతి లేదని, చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశామని చెప్పారు. తప్పు చేసిన వారికి శిక్షలు తప్పవని హెచ్చరించారు. 

Tags:    

Similar News