‘ఫీజులు లేకుండా కాలేజీలు ఎలా నడపాలి’

ఫీజులు లేకుండా కాలేజీలు ఎలా నడపాలని నిర్మల్ జిల్లా ప్రైవేటు

Update: 2024-10-15 12:40 GMT

దిశ ప్రతినిధి,నిర్మల్ : ఫీజులు లేకుండా కాలేజీలు ఎలా నడపాలని నిర్మల్ జిల్లా ప్రైవేటు డిగ్రీ కళాశాల యాజమాన్యాల సంఘం ప్రశ్నించింది. నిర్మల్ జిల్లా డిగ్రీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు. అన్ని కళాశాల యాజమాన్యాలు , లెక్చరర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా ధర్నాలో పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా అధ్యక్షుడు జి. నరేష్ గౌడ్ మాట్లాడుతూ బీసీ ,ఎస్సీ ,ఎస్టీ ,మైనార్టీ విద్యార్థులు స్కాలర్షిప్ లు మూడు సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్నాయని, అయినా ఒక్క విద్యార్థి దగ్గర కూడా కాలేజీ ఫీజులు తీసుకోకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వస్తున్నామని చెప్పారు.

ఇక కాలేజీలు నడపలేని స్థితిలో ఉన్నాయని దాదాపుగా కాలేజీలను మూసివేసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడైనా సకాలంలో విడుదల చేసి గ్రామీణ పేద విద్యార్థులను, ప్రైవేట్ కళాశాలలను, ప్రైవేటు లెక్చర్లను ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నవించారు. ఈ ధర్నా కార్యక్రమం అనంతరం అందరూ కలిసి శాంతియుత ర్యాలీ నిర్వహించి ఆర్డీవో కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యాల సంఘం ప్రతినిధులు సిహెచ్ వెంకటరెడ్డి, బి సాయిలు, ఏ అఖిలేష్ కుమార్, వెంకటేష్ గౌడ్, విఠల్ రావు ,బద్రి ప్రవీణ్, శ్రీనివాస్ గౌడ్, టీ నర్సారెడ్డి ,లక్ష్మీనరసయ్య శ్రీధర్ ,ఏ శ్రీనివాస్ ,ఎస్ రవి హైమద్ భాషా తదితరులు పాల్గొన్నారు.


Similar News