ప్రమాదాల నివారణకే రక్షణ కిట్లు : కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

ప్రమాదాల నివారణకే ప్రభుత్వం గీత కార్మికులకు కాటమయ్య రక్షణ

Update: 2024-10-15 12:48 GMT

దిశ,ఆసిఫాబాద్ : ప్రమాదాల నివారణకే ప్రభుత్వం గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్లను అందిస్తోందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కోవ లక్ష్మి,జిల్లా ఆబ్కారీ శాఖ అధికారి జ్యోతి కిరణ్ లతో కలిసి గీత కార్మికులకు రక్షణ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని, ఇందులో భాగంగానే ప్రమాదాలు జరగకుండా, శిక్షణ ఇచ్చి రెండు అసెంబ్లీ సెగ్మెంట్ లో నుండి 69 మంది గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్లను అందించినట్లు పేర్కొన్నారు. కార్మికులు వాటిని సద్వినియోగం చేసుకొని ప్రమాదాలను నివారించాలని సూచించారు. అంతకుముందు ఎమ్మెల్యే మాట్లాడారు గీత వృత్తిని, గౌడ కులస్తులు తరాల నుండి కొనసాగిస్తూ జీవనోపాధి పొందుతున్నారని, గీత కార్మికుడి పై కుటుంబం ఆధారపడి ఉంటుందని, ప్రతి గీత కార్మికుడు రక్షణ ఇట్లను ధరించి తన వృత్తిని కొనసాగించాలని తెలిపారు.


Similar News