దిశ ప్రతినిధి, నిర్మల్ః శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నలభై గేట్లను ఎత్తి వరద నీటిని గోదావరికి వదులుతున్నారు అధికారులు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరింది. సుమారు రెండు లక్షల క్యూసెక్కుల మేర వరద నీరు వస్తుండడంతో ఒక లక్ష 50 వేల క్యూసెక్కుల చొప్పున వరద నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఈ సీజన్లో ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టానికి చేరడంతో రైతాంగం హర్షం వ్యక్తం అవుతున్నారు.