మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు.

Update: 2024-10-18 10:25 GMT

దిశ,కడెం : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. శుక్రవారం మత్స్య శాఖ రాష్ట్ర చైర్మన్ మెట్టు సాయికుమార్ తో కలిసి నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులో చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు వందశాతం రాయితీతో చేప పిల్లలను అందిస్తుందని అన్నారు. మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం మత్స్యశాఖ రాష్ట్ర చైర్మన్ మెట్టు సాయి కుమార్ తో పాటు అధికారులతో కలిసి పడవలో ప్రయాణిస్తూ కడెం ప్రాజెక్టును విక్షించారు. ప్రాజెక్ట్ విశిష్టతను మత్స్య శాఖ చైర్మన్ కు తెలియజేశారు.

    అనంతరం మత్స్యకారులు శాలువాతో సత్కరించారు. అనంతరం మండలంలోని పెద్దూరు గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు తమ ప్రతి పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్దే అమ్మాలని సూచించారు. ధాన్యం గ్రేడ్- ఏ క్వింటల్ కు రూ. 2,320, సాధారణ రకం క్వింటాల్ కు 2300 రూపాయల ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ విజయలక్ష్మి, ఎంపీడీఓ అరుణ, తహసీల్దార్ సుజాత, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు దుర్గ భవాని, తరి శంకర్, మండల అధ్యక్షుడు తుమ్మల మల్లేష్, నాయకులు ముస్కు రాజు, వాజిత్ ఖాన్, బొడ్డు గంగన్న, ఆకుల లచ్చన్న, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News