మాజీ నక్సలైట్ హుస్సేన్ కిడ్నాప్..?

భారత నిషేధిత భారత కమ్యూనిస్టు (మావోయిస్టు) పార్టీ అనుబంధం సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) మాజీ అగ్రనేత ఎండి హుస్సేన్ (సుధాకర్, రమాకాంత్,)ను సోమవారం ఉదయం 7 గంటలకు పోలీసులు గా భావిస్తున్న కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Update: 2024-07-08 05:33 GMT

దిశ, మందమర్రి : భారత నిషేధిత భారత కమ్యూనిస్టు (మావోయిస్టు) పార్టీ అనుబంధం సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) మాజీ అగ్రనేత ఎండి హుస్సేన్ (సుధాకర్, రమాకాంత్,)ను సోమవారం ఉదయం 7 గంటలకు పోలీసులు గా భావిస్తున్న కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఆదివారం పోలీసులు గా భావిస్తున్న కొంతమంది వ్యక్తులు జమ్మికుంట లోని తమ బంధువుల నివాసంలో హుస్సేన్ ను కలిసినట్లు తెలిపారు. ఒక వ్యక్తికి జమానత్ పడ్డ విషయమై కొంతసేపు చర్చించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా సోమవారం ఉదయం నివాసంలోకి చొరబడి బలవంతంగా ఎరుపు రంగు కారులో తీసుకువెళ్లినట్టు వారు పేర్కొన్నారు.

మంచిర్యాల జిల్లాకు చెందిన పోలీసులే ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేశారు. మాజీ నక్సలైట్ ఎండి హుస్సేన్ గత కొన్ని సంవత్సరాలుగా జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. గతంలో అతను మందమర్రి ఏరియాలో సింగరేణి కార్మికుడిగా విధులు నిర్వహిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ పీపుల్స్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. పీపుల్స్ వార్ అనుబంధ సంస్థ సింగరేణి కార్మిక సమాఖ్య సికాస కార్మిక ఉద్యమంలో చురుగ్గా పాల్గొని లంచగొండి విధానం, అధికారుల పెత్తనం, వెజ్ బోర్డు పెరుగుదల తదితరులలో కీలక పాత్ర పోషించి కార్మికుల మన్ననలు పొందారు. ఈ కిడ్నాప్ కు పాల్పడింది పోలీసుల లేక ఇతరుల అనే విషయం తేలాల్సి ఉంది.


Similar News