కేలాపూర్ పాదయాత్ర ప్రారంభించిన ఎమ్మెల్యేలు
ప్రతి ఏటా గత కొన్ని ఏళ్లుగా కొనసాగిస్తున్న దుర్గా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాణి సతీష్ ఆలయం నుంచి మహారాష్ట్రలోని కేలాపూర్ దుర్గామాత ఆలయానికి వెళ్లే మహా పాదయాత్రను ఆదిలాబాద్ ఎమ్మెల్యే, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేలు ప్రారంభించారు.
దిశ, ఆదిలాబాద్: ప్రతి ఏటా గత కొన్ని ఏళ్లుగా కొనసాగిస్తున్న దుర్గా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాణి సతీష్ ఆలయం నుంచి మహారాష్ట్రలోని కేలాపూర్ దుర్గామాత ఆలయానికి వెళ్లే మహా పాదయాత్రను ఆదిలాబాద్ ఎమ్మెల్యే, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేలు ప్రారంభించారు. శనివారం ముందుగా ఆదిలాబాద్ నుంచి కేలాపూర్ మహారాష్ట్ర కి పాదయాత్ర పూజ చేసి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ ధన్‌పాల్ సూర్యనారాయణలు పూజ చేసి యాత్రను ప్రారంభించి భక్తులతో కలిసి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా మహారాష్ట్రలోని కేలాపూర్ దుర్గామాత ఆలయానికి వందల కిలోమీటర్లు భక్తులు పాదయాత్రగా వెళ్లడం అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందని అన్నారు.
ఉపవాస దీక్షలు చేపట్టి దుర్గా నవరాత్రులలో వేలాది మంది భక్తులు ఆదిలాబాద్ జిల్లా నుంచి కాలినడకన వెళ్తారని పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా గత ఏడాది కంటే ఎక్కువగా వేలాదిమంది కాలినడకన అమ్మవారిని దర్శించుకునేందుకు కేలాపూర్‌కు బయలుదేరడం హర్షనీయమని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ దుర్గా నవరాత్రులలో యువత సైతం భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపట్టి కాలినడకన కీలాపూర్ లోని దుర్గామాత ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇంతటి దైవభక్తిని ప్రదర్శిస్తున్న ఆదిలాబాద్ జిల్లా యువతి యువకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అదే విధంగా రాష్ట్రంలోని హిందూ దేవతల అన్నిటి ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి తమ ఐక్యమత్యాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు హిందూ సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు,రాజకీయ నాయకులు, ప్రజలు భక్తులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.