విజయోత్సవాలను ఘనంగా నిర్వహించాలి
ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన విజయోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు.
దిశ, ఆసిఫాబాద్ : ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన విజయోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి అధికారులతో ప్రజాపాలన విజయోత్సవాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రజాపాలన విజయోత్సవాలను ఆయా శాఖల అధికారులకు కేటాయించిన తేదీల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో పోటీలతో ప్రారంభించి. ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పై ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే సంవత్సరంలో సాధించిన లక్ష్యాలు, చేపట్టిన పనుల నివేదికలను శనివారంలోగా శాఖల వారీగా ముఖ్య ప్రణాళిక అధికారికి అందించాలని ఆదేశించారు.