అన్నదాతల అవస్థలు
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కాపాడుకోవడానికి అన్నదాతకు అవస్థలు తప్పడం లేదు.
వర్షం నుంచి ధాన్యాన్ని కాపాడుకునేందుకు తంటాలు
దిశ, లోకేశ్వరం: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కాపాడుకోవడానికి అన్నదాతకు అవస్థలు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభించకపోవడంతో అమ్మకానికి కొనుగోలు కేంద్రాల్లో సిద్ధంగా ఉంచిన వరి ధాన్యం కాపాడుకోవడానికి అన్నదాతలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. మంగళవారం సాయంత్రం లోకేశ్వరం మండలంలో భారీ ఈదురుగాలులు వీయగా ధాన్యం కుప్పలపై కప్పిన టార్పాలిన్ కవర్లు లేచిపోవడంతో అదే సమయంలో కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోయింది. దీనితో వర్షం బారి నుండి వరి ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతుల కుటుంబాలు పడిన ఇబ్బందులు రైతుల కంటతడి పెట్టిస్తోంది. ఇకనైనా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతులు వేడుకుంటున్నారు.