వానరులమైనా వరుసలోనే వస్తాం....

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఓ అంజన్న భక్తుడు నిర్మల్ - అదిలాబాద్ వెళ్లే రహదారిలో మూగ జీవులకు పండ్లు అందించాడు.

Update: 2024-11-15 09:50 GMT

దిశ, భైంసా : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఓ అంజన్న భక్తుడు నిర్మల్ - అదిలాబాద్ వెళ్లే రహదారిలో మూగ జీవులకు పండ్లు అందించాడు. దాంతో చుట్టుపక్కల ఉన్న కోతులు అక్కడికి వచ్చాయి. కానీ ఒక్కసారిగా మీద ఎగబడకుండా క్రమశిక్షణతో ఒకదాని వెనుక ఒకటి క్యూ ప్రకారం వచ్చి ఆ వ్యక్తి అందించే పండ్లు తీసుకెళ్లాయి. దానిని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్​ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం అది వైరల్​గా మారింది. ఆహారం కనిపిస్తే మీదపడి చిందరవందర చేసే కోతులు ఇలా క్రమశిక్షణ పాటించడంతో అవన్నీ డిసిప్లెయిన్ మంకీస్ అంటూ ఆ వీడియో చూసిన వారు కితాబిస్తున్నారు.  


Similar News