గిరిజన గ్రామంలో తాగునీటి కష్టాలు..
నేరడిగొండ మండల కేంద్రంలోని గాజిలి (సెర్ గూడ) గ్రామంలో తాగునీటి కష్టాలు నెలకొన్నాయి.
దిశ, నేరడిగొండ : నేరడిగొండ మండల కేంద్రంలోని గాజిలి (సెర్ గూడ) గ్రామంలో తాగునీటి కష్టాలు నెలకొన్నాయి. మిషన్ భగీరథ నీళ్లు సరిగ్గా సరఫరా కావడం లేదు. దీంతో ఈ గ్రామాల ప్రజలు తాగునీటికి తహతహలాడుతున్నారు. సమీపంలోని వ్యవసాయ బోరుబావి నీటిని తీసుకువచ్చి తాగాల్సి వస్తుందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. ఈ విషయమై మిషన్ భగీరథ శాఖ ఏఈ దృష్ఠికి పలుమార్లు తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా సరఫరా జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.