సింగరేణి క్వార్టర్ల కు రికమెండ్ పత్రం ఇవ్వొద్దు.. MLA Balka Suman

సింగరేణి కాలరీస్ కంపెనీ మందమర్రి ఏరియాలో కంపెనీ క్వార్టర్లు ఖాళీ లేక ఇబ్బందులు పడుతున్నారు..

Update: 2023-01-17 07:34 GMT

దిశ, మందమర్రి : సింగరేణి కాలరీస్ కంపెనీ మందమర్రి ఏరియాలో కంపెనీ క్వార్టర్లు ఖాళీ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక నుండి క్వార్టర్లకు ఎమ్మెల్యే రికమండ్ లెటర్లు ఇవ్వద్దని మందమర్రి తన పిఏలకు చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదేశించినట్లు తెలిసింది. కార్మికులకు సింగరేణి క్వార్టర్ల కేటాయింపులో ఒక గృహానికి నలుగురి పేరిట విజ్ఞాపన పత్రాలు ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఇక నుండి దానికి చెల్లుచీటీ పతకాలని బీఆర్ఎస్ అనుబంధం టీబీజీకేఏస్ నాయకులకు విప్ సూచించినట్లు సమాచారం. ఒక పిఏ కు తెలియకుండా మరొక పిఏ రికమండ్ లెటర్లు ఇవ్వడంపై ఎమ్మెల్యే సుమన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసోంది. ఇక నుండి ఎవరు ఏ శాఖకు లెటర్లు ఇచ్చిన వాటి నకలు ధ్రువపత్రాలను తమ వద్ద ఉంచుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ మధ్య మందమర్రి జిఎం కార్యాలయానికి ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ లెటర్ ప్యాడ్ నకిలీ సంతకంతో జిఎం కార్యాలయానికి వచ్చి వివాదానికి తెరలేపిన దృష్ట్యా ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

తన నకిలీ సంతకంతో వచ్చిన పత్రంపై విచారణ చేపట్టి దోషులను గుర్తించాలని ఆయన కోరినట్లు సమాచారం. గత కొంతకాలంగా సింగరేణి కంపెనీ క్వార్టర్ల కేటాయింపులో నాయకులు కార్మికుల నుండి 40 నుంచి 70 వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు.. బహటంగానే కథనాలు వినిపిస్తున్నాయని ఎన్నికలు సమీపిస్తున్న దృశ్య అది క్షేమం కాదని ఇలాంటి ప్రచారాల వల్ల పార్టీ, యూనియన్ ల ఉనికికి మునుముందు పెను ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందని. కొంతమంది జిల్లా బాస్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిసింది. ఈ విషయంపై హైదరాబాదులో కోల్ బెల్ట్ కు చెందిన కీలక నాయకులతో చర్చ జరిగినట్టు సమాచారం. చాలాకాలంగా అపవాదులకు దూరంగా ఉండాలని టీఆర్ఎస్ , టీబీజీకేఏస్ నాయకులకు సూచించినప్పటికీ ఎవ్వరి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విప్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ చర్యతోనైనా నాయకులలో మార్పు వస్తుందో లేదో వేచి చూడాలని పార్టీ, యూనియన్ వర్గాలు గుసగుస లాడుతున్నాయి.

Also Read...

ఆలయాలను ప్రభుత్వం బిజినెస్ సెంటర్లుగా మార్చింది 

Tags:    

Similar News