DCC : కాంగ్రెస్ ను బలహీన పర్చడానికి కుట్ర
కాంగ్రెస్ పార్టీని బలహీన పర్చడానికి కొందరు కావాలనే కుట్రలు చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ అన్నారు.
దిశ, ఆసిఫాబాద్ : కాంగ్రెస్ పార్టీని బలహీన పర్చడానికి కొందరు కావాలనే కుట్రలు చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ అన్నారు. సమావేశం అనంతరం ఎమ్మెల్సీ దండే విఠల్ తో ఆయన మీడియాతో మాట్లాడారు. సమావేశానికి సంబంధించి వ్యక్తిగతంగా ఎవరికీ చెప్పలేదని, జిల్లా పార్టీకి సంబంధించిన వివిధ వాట్సాప్ గ్రుపుల్లో పెట్టామన్నారు.
కులగణన సమావేశం కావడంతో అధిష్టానం ఆదేశాల మేరకు ఆయా కులాల నాయకుల కు ప్రత్యేకంగా ఫోన్ చేసి రావాలని చెప్పినట్టు తెలిపారు. దీన్ని కావాలనే సమావేశంలో వీళ్లు రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం కల్గించేలా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేశామని, వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. అలాగే పార్టీలో ఎవరూ శాశ్వతం కాదని పేర్కొన్నారు.