చిన్నారి దుర్గకు సీఎం రేవంత్ బాస‌ట‌.. అండగా నిలవాలని కలెక్టర్ కు ఆదేశం

Update: 2024-08-19 12:38 GMT

దిశ, భైంసాః త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌తో ఒంట‌రిగా మిగిలిపోయిన బాలిక దుర్గ‌ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అన్ని విధాలా అండ‌గా వుండాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ను ఆదేశించారు. నిర్మ‌ల్ జిల్లా తానూర్ మండ‌లం బేల్‌త‌రోడా గ్రామానికి చెందిన ఒంట‌రి మ‌హిళ గంగామ‌ణి (36) శ‌నివారం రాత్రి ఆత్మ‌హ‌త్య చేసుకోగా ఆమె ఏకైక కుమార్తె దుర్గ(11) అనాథ‌గా మిగిలింది. త‌ల్లి అంత్య‌క్రియ‌ల‌కు డ‌బ్బులేక‌పోవ‌డంతో దుర్గ భిక్షాట‌న చేసింది. ఈ వార్తని మొదట దిశ పత్రికలో ప్రచురించగా.. తర్వాత అన్ని మీడియాలలో ప్రసారం అయింది. దీంతో రాష్ట్ర, కేంద్ర మంత్రులతో సహా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా వెళ్ళగా.. ఆయ‌న వెంట‌నే స్పందించారు. బాలిక‌కు విద్య, వైద్య‌, ఇత‌ర అవ‌స‌రాల‌కు అండ‌గా నిల‌వాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ అభిలాష్ అభిన‌వ్‌ను ఆదేశించారు. ముఖ్య‌మంత్రి ఆదేశం మేర‌కు బాలిక‌కు ఉచిత విద్య అందించేందుకు గురుకుల పాఠ‌శాల‌లో చేర్చుతామ‌ని క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు. వైద్య‌, ఇత‌ర స‌మ‌స్య‌లేమైనా ఉంటే వాటిని వెంట‌నే ప‌రిష్క‌రిస్తామ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు.


Similar News