సీఎం కేసీఆర్ కుటుంబ పాలనను తరిమికొట్టాలి: కేంద్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల
తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబ పాలనను తరిమికొట్టాలంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని, అది కేవలం బూత్ స్థాయిలో పని చేసే కార్యకర్తలతోనే సాధ్యం అవుతోందని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు.
దిశ, మంచిర్యాల టౌన్: తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబ పాలనను తరిమికొట్టాలంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని, అది కేవలం బూత్ స్థాయిలో పని చేసే కార్యకర్తలతోనే సాధ్యం అవుతోందని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు.శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని హోటల్ సురభిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అసెంబ్లీ శక్తి కేంద్ర ఇన్ చార్జిల సమావేశనికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో నరేంద్ర మోదీ గారి పాలనను స్ఫూర్తిగా తీసుకొని కార్యకర్తలు అందరూ కష్టపడి పని చేయాలన్నారు. మంచిర్యాల పర్యటనకు వచ్చిన కేంద్ర మత్స్యశాఖ మంత్రికి మంచిర్యాల గంగపుత్ర సంఘం సభ్యులు తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా ఇన్ చార్జి పల్లే గంగారెడ్డి, గోనె శ్యాంసుందర్ రావు, అరుముళ్ల పొషం, విష్ణువర్ధన్, మల్లికార్జున్, నాగునూరి వెంకటేశ్వర్ గౌడ్, తోట మల్లికార్జున్, రజినిష్ జైన్, ఆందుగుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.