సారంగాపూర్‌లో బీఆర్ఎస్ ధర్నా
పెట్రోల్, డీజిల్, నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య ప్రజలకు ... BRS Protest at Sarangapur
దిశ, సారంగాపూర్: పెట్రోల్, డీజిల్, నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య ప్రజలకు మోడీ ప్రభుత్వం గుది బండగా మారిందంటూ మండల ఎంపీపీ అట్ల మహిపాల్ రెడ్డి, పార్టీ కన్వీనర్ మాధవరావులు విమర్శించారు. సారంగాపూర్ మండల కేంద్రం బస్టాండ్ ప్రాంగణంలో పెరిగిన సిలిండర్ గ్యాస్ ధరలకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలో రూ. 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర నేడు 1150 రూపాయలకు పెరగడం సామాన్య ప్రజలకు బారంగా మారిందని అన్నారు. కార్పొరేట్లకు దేశ సంపద దోచిపెట్టడానికి సామాన్య ప్రజల నిత్యవసరాలైన గ్యాస్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచుతున్నారని దుయ్యబట్టారు. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అడెల్లి పోచమ్మ, చందు, నారాయణరెడ్డి, మాణిక్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ ఆశ్రిత శ్రీనివాస్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజ్ మహమ్మద్, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.