బాసర ఆలయ దొంగ అరెస్ట్.. చెప్పిన గడువులోగా అరెస్ట్ చేసిన ఎస్పీ

Update: 2024-08-19 12:23 GMT

దిశ ప్రతినిధి, నిర్మల్ః గత బుధవారం జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో హుండీ పగలగొట్టిన నిందితుడిని నిర్మల్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే గత బుధవారం బాసర ఆలయంలోకి కొందరు చొరబడి ఆలయ హుండీని రాయితో పగలగొట్టిన ఘటన కలకలం రేపింది. ఆలయ భద్రతపై భక్తుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది ఈ నేపథ్యంలో ఎస్పీ జానకి షర్మిల కేసును సీరియస్ గా తీసుకున్నారు. మూడు రోజుల్లో నిందితున్ని పట్టుకుంటామని ప్రకటించిన ఆమె రెండు రోజుల వ్యవధిలోనే అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలానికి చెందిన కుసిడిగ సాయికుమార్ అనే యువకుడు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే గత బుధవారం బాసర ఆలయంలోకి చొరబడి హండి పగలగొట్టి రూ.14600 దోచుకున్నాడు. ఆదివారం సాయంత్రం బాసర సమీపంలో సాయికుమార్ ను పట్టుకున్నామని ఎస్పీ తెలిపారు. ఆయన వద్ద నుంచి మోటార్ సైకిల్ రూ.6000 నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసును సకాలంలో దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్న బాసర పోలీసులను ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో బైంసా అదనపు ఎస్పి అవినాష్ కుమార్, సీఐ మల్లేష్ ఎస్సై గణేష్, సిబ్బంది మోహన్ సింగ్ పాల్గొన్నారు.

Tags:    

Similar News