కూష్మాండ దేవి అవతారంలో బాసర సరస్వతి

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి క్షేత్రంలో శ్రీశారదీయ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

Update: 2022-09-29 10:56 GMT

దిశ, బాసర : నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి క్షేత్రంలో శ్రీశారదీయ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నాలుగవ రోజైన గురువారం అమ్మవారు కూష్మాండ దేవి అవతారంలో సింహ వాహినియై 8చేతులలో చక్రం, ఖడ్గం, గద, పాశం, ధనువు, బాణాలు, తేనె భాండం, రక్త భాండం ధరించి భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవార్లకు అల్లం గారెలు నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Tags:    

Similar News