బండి సంజయ్ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి

బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి పదో తరగతి పరీక్ష పత్రాన్ని లీకేజీకి పాల్పడిన ఎంపీ బండి సంజయ్ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డిమాండ్ చేశారు.

Update: 2023-04-06 09:06 GMT

దిశ, బెల్లంపల్లి: బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి పదో తరగతి పరీక్ష పత్రాన్ని లీకేజీకి పాల్పడిన ఎంపీ బండి సంజయ్ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణంలోని కాంట చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ వేలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడని మండిపడ్డారు.

అత్యున్నతమైన పదవిలో ఉన్న బండి సంజయ్ పేపర్ లీకేజీకి పాల్పడడం సిగ్గుచేటని విమర్శించారు. అతడికి రాజకీయాల్లో కొనసాగే నైతిక హక్కు లేదని విమర్శించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కి వ్యతిరేకంగా గులాబీ శ్రేణులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బొడ్డు నారాయణ, మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

Tags:    

Similar News