ఇక గ్రామ స్థాయి నుంచి ప్రజావాణి

ఇక గ్రామ స్థాయి నుంచి ప్రజావాణి అమలు కానుంది.

Update: 2024-09-11 14:30 GMT

దిశ, ఆదిలాబాద్ : ఇక గ్రామ స్థాయి నుంచి ప్రజావాణి అమలు కానుంది. ఇందుకు పైలెట్ జిల్లాగా ఆదిలాబాద్ ను ఎంపిక చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సబ్ కలెక్టర్ యువరాజ్ మార్మట్, ట్రైనీ కలెక్టర్ అభిగ్యాన్, అదనపు కలెక్టర్ శ్యామల దేవితో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రజాపాలన కార్యక్రమాన్ని డిసెంబర్ లో ప్రారంభించారని తెలిపారు. దీంతో సమస్యలు పరిష్కారమవుతున్న నేపథ్యం లో ఈ వ్యవస్థను రాష్ట్ర మంతటా విస్తరింప జేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.

    అందుకు ముందుగా ఆదిలాబాద్ జిల్లా ను పైలెట్ గా ఎంచుకొని బోథ్, ఇంద్రవెల్లి, తలమడుగు, డివిజన్ పరిధిలో అదిలాబాద్, ఊట్నూర్, ఐటీడీఏ ఊట్నూర్, గ్రామస్థాయిలో బోథ్ మండలంలోని సోనాల, ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్, తలమడుగు మండలంలోని కజ్జర్లతో కలిపి మొత్తం 9 కేంద్రాలలో ప్రజావాణిని ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలియజేశారు. ఈ సమావేశంలో ఆర్డీవో వినోద్ కుమార్, సంబంధిత అధికారులు, తహసీల్దార్లు, తదితరులు పాల్గోన్నారు.   

Tags:    

Similar News