చారిత్రిక కట్టడాలను అభివృద్ధి చేస్తాం.. ఎంపీ సోయం బాపురావు

నిర్మల్ జిల్లా బాదనకుర్తి గ్రామంలో గోండు రాజులు పాలించిన చరిత్రాత్మక కట్టడాలను అర్క వంశీయులు, గ్రామస్తులతో, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు సందర్శించారు.

Update: 2022-10-02 13:31 GMT

దిశ, ఖానాపూర్ : నిర్మల్ జిల్లా బాదనకుర్తి గ్రామంలో గోండు రాజులు పాలించిన చరిత్రాత్మక కట్టడాలను అర్క వంశీయులు, గ్రామస్తులతో, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు సందర్శించారు. ప్రతి సంవత్సరం గోండు రాజులకు అర్క వంశీయులు పూజలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం అర్క వంశీయులతో కలిసి ఎంపీ సోయం బాపురావు గోండు రాజులకు ఆదివారం పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇక్కడి చారిత్రక కట్టడాల ప్రాధాన్యం గురించి పర్యాటక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళతానని ఆయన అన్నారు. చారిత్రక కట్టడాల ఆనవాళ్లైన కోనేరు, విగ్రహాలను కాపాడే బాధ్యత తీలుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలోని జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మస్కపూర్ గ్రామంలోని దుర్గా దేవి మండపంలోని దుర్గామాతకు పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ఖానాపూర్ అసెంబ్లీ నాయకులు అజ్మీరా హరినాయక్, అసెంబ్లీ కన్వీనర్ పడాల రాజశేఖర్, అసెంబ్లీ కోకన్వీనర్ గడ్డం నందిరెడ్డి, పెంబి జెడ్పీటీసీ బుక్యా జానకీ రమేష్, ఖానాపూర్ మండల అధ్యక్షుడు టేకు ప్రకాష్, బీజేవైఎం జిల్లా ప్రధానకార్యదర్శి పుప్పాల ఉపేందర్, ఉపాధ్యక్షుడు సందుపట్ల శ్రావణ్, మండల ప్రధానకార్యదర్శి పెద్ది రమేష్ , మండల ఉపాధ్యక్షులు ఎనగందుల రవి, ఇనుముల స్వామి, దోనికేని సాగర్ గబాధనకుర్తి సర్పంచ్ పార్శపు శ్రీనివాస్, ఉప సర్పంచ్ నవీన్, శనిగారపు శ్రావణ్, పాల సంతోష్, అర్క వంశీయులు ఆర్కా మధు, అర్క వెంకట్రావు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News