వాహనాలు అతివేగంగా నడిపితే చర్యలు తప్పవు.. సీఐ రవీందర్

వాహనదారులు అతివేగంగా, అజాగ్రత్తగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ రవీందర్ హెచ్చరించారు.

Update: 2024-07-05 10:52 GMT

దిశ, చెన్నూరు : వాహనదారులు అతివేగంగా, అజాగ్రత్తగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ రవీందర్ హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా పట్టుబడ్డ ద్విచక్ర వాహనాల యజమానులకు పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ రవీందర్ కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్పెషల్ డ్రైవ్ లో రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తున్నామన్నారు..

వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని. వాహనదారులు తప్పనిసరిగా వాహన ధ్రువీకరణ పత్రాలు, లైసెన్సులు, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉండి ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో ఇన్సూరెన్స్ వర్తించదు కాబట్టి ఇన్సూరెన్స్ గడువు ముగియక ముందే దాన్ని రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా అతి వేగంగా వాహనాలు నడుపుతున్న, మైనర్ పిల్లలు వాహనాలు నడపడం, నెంబర్ ప్లేట్ లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రతిరోజు పట్టణ సరిహద్దు ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామని వాహనదారులు జాగ్రత్త వహించాలని ఆయన అన్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికి వాహనదారులు రోడ్లపై పార్కింగ్ చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్వేత తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.


Similar News