Brahma kamalam : బెల్లంపల్లిలో వికసించిన బ్రహ్మ కమలం..

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో అరుదైన బ్రహ్మకమలం విరబూసింది. పట్టణంలోని కన్నాలబస్తీకి చెందిన రమేష్ - లావణ్య ఇంటి ఆవరణలో గురువారం రాత్రి బ్రహ్మ కమలం విరబూసింది.

Update: 2023-09-29 10:08 GMT

దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో అరుదైన బ్రహ్మకమలం విరబూసింది. పట్టణంలోని కన్నాలబస్తీకి చెందిన రమేష్ - లావణ్య ఇంటి ఆవరణలో గురువారం రాత్రి బ్రహ్మ కమలం విరబూసింది. హిమాలయాల్లో మాత్రమే వికసించే ఈ బ్రహ్మకమలం తమ ఇంటి ఆవరణలో విరబూయడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయింది. బ్రహ్మకమలం పుష్పానికి హారతులు ఇచ్చి, కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప ఇంటి ఆవరణలో అరుదైన బ్రహ్మ కమలం విరబూయదని రమేష్ లావణ్య పరవశించి పోయారు.

అరుదైన బ్రహ్మకమలం విరబూయడానికి 25 రోజుల సమయం పడుతుంది. బ్రహ్మ కమలం రాత్రి మాత్రమే విరబూస్తుంది. కమలం విరబూసిన సమయంలో వెదజల్లే సువాసన కొన్ని మీటర్ల వరకు వ్యాపించటం దాని ప్రత్యేకతగా చెప్పుకుంటారు. విరబూసిన బ్రహ్మ కమలం కొన్ని గంటలు మాత్రమే విచ్చుకొని తర్వాత వాడిపోతుంది. బ్రహ్మ కమలాన్ని తిలకించడానికి స్థానికులు పెద్ద ఎత్తున రమేష్ లావణ్య ఇంటికి తరలివెళ్లారు. బ్రహ్మ కమలాన్ని దర్శించుకుని భక్తిభావాన్నిచాటుకున్నారు.

Tags:    

Similar News