మినీ స్టేడియం కట్టింది ఆడటానికా..!లేక కట్టారని చూడటానికా..!

క్రీడలు మనిషి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడి మరింత ముందుకు

Update: 2024-07-06 09:04 GMT

దిశ,భైంసా : క్రీడలు మనిషి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడి మరింత ముందుకు తీసుకెళ్లడానికి తోడ్పడతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మైదానాలు అనువుగా ఉంటే శారీరక దారుఢ్యం ఫిజికల్ ఫిట్నెస్ గల యువతకు పోలీసులు,అగ్నివీర్ (ఆర్మీ) వంటి కొలువుల ప్రాక్టీస్ నిమిత్తం పనికి వస్తాయి. అలాంటిది బైంసా నుండి పార్ఢీ(బి) వెళ్ళే రహదారిలో కమలాపూర్ గుట్ట సమీపంలో రూ. 2.65కోట్లతో (ఇండోర్,అవుట్ డోర్) క్రీడలను ఆడటానికి నిర్మించినటువంటి మినీ స్టేడియం ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. 2012 లో క్రీడా మైదానం కొరకు స్థల సేకరణ చేయగా,2014లో ఈ క్రీడా మైదాన పనులు ప్రారంభం కొరకు నిధులు మంజూరు చేశారు. కొన్ని సంవత్సరాల క్రితమే నిర్మాణ పనులు పూర్తయిన ఆటలు ఆడటానికి మాత్రం ఇప్పటికీ క్రీడా మైదానాన్ని ప్రారంభించడం లేదు. దీంతో అటు వైపు వెళ్తున్న పలువురు ప్రజలు క్రీడా మైదానం కట్టింది ఆడడానికా..!చూడడానికా..! అంటూ సెటైర్లు వేస్తున్నారు. తొందర్లోనే ప్రారంభం అయితే ప్రైవేట్ జిన్నింగ్ ఫ్యాక్టరీలు, ఖాళీ స్థలం వెంచర్లో ఆటలు ఆడే బెడద తప్పుతుందని వాపోతున్నారు.

కొత్తది పాతది అవుతుంది..

2.65 కోట్లతో నిర్మించిన క్రీడా మైదానం కొన్ని సంవత్సర క్రితమే పనులు పూర్తి అయిన ఇంకా ప్రారంభం కావడం లేదు. స్టేడియం మొత్తం పిచ్చి మొక్కలు, బాటిళ్ళతో నిండి, గతంలో కురిసిన భారీ గాలివర్షాలకు స్టేడియం పైభాగంలో కొన్ని రేకులు కాస్త ఊడిపోయాయి. దీంతో నిర్మించిన మినీ స్టేడియం కొత్తది కాస్త పాతదిలా కనిపిస్తుంది.కొన్ని సందర్బాలలో పార్కింగ్ ప్లేస్ లా కొందరు వాహనాలు నిలపడానికి వాడుతున్నారు. దీన్ని నిర్మించిన కాలపరిమితి 5 సంవత్సరాలు కూడా పూర్తి అయిపోయింది. దీంతో ఐదు సంవత్సరాలు పూర్తి అయినట్లు అయితే కాంట్రాక్టర్ రిపేర్ చేయడానికి కూడా ముందుకు రారు. కాంట్రాక్టర్లు వారు నిర్మించిన ఏ నిర్మాణానికి అయిన ఐదు సంవత్సరాల లోపు వారి బాధ్యత ఉంటుంది.

కోవిడ్ కారణంగా మరింత ఆలస్యం..

నిర్మించిన మినీ స్టేడియం గత కొన్ని సంవత్సరాల క్రితమే పనులన్నీ పూర్తయిన కేవలం క్రీడా సామాగ్రి మాత్రమే కావాల్సి ఉండగా దాదాపు గత నాలుగు సంవత్సరాల క్రితం కరోనా ఫస్ట్,సెకండ్ వేవ్ మహమ్మారి వలన ప్రారంభానికి నోచుకోలేదని కొందరు ప్రజల అభిప్రాయం,ఇకనైనా ఈ మినీ క్రీడా మైదానాన్ని కొత్తగా ఎన్నికైన ప్రస్తుత ఎమ్మెల్యేనైన ప్రారంభించి యువత కి ఇండోర్,అవుట్ డోర్ క్రీడలు ఆడడానికి అవకాశం ఉండేలా అధికారులు,ప్రజాప్రతినిధులు చూడాలని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.లేదంటే తొందర్లోనే కట్టిన నిర్మాణం కాస్త ఇంకా శిధిలావస్తకు చేరుతుందని,అది కాక ముందే ఈ ప్రారంభం కాస్త జరపాలని క్రీడాకారులు కోరుకుంటున్నారు.


Similar News