విధి రాసిన రాతలో ఒంటరైన చిన్నారి.. కొన్ని రోజుల క్రితం తండ్రి ఈ రోజు తల్లి మృతి
విధి రాసిన రాతలో ఓ బాలిక ఒంటరిగా మిగిలిపోయింది.
దిశ, భైంసా: విధి రాసిన రాతలో ఓ బాలిక ఒంటరిగా మిగిలిపోయింది. తండ్రి చనిపోయిన కొన్ని రోజులకే తల్లి శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన ముధోల్ తాలూకా తానూరు మండలం బెల్ తరోడ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బెల్ తారోడా గ్రామంలో నివాసం ఉంటున్న గంగామని (36) భర్తతో గత కొన్ని సంవత్సరాల క్రితం వేరుగా వుంటూ, ఒంటరిగా కూలీనాలీ చేసుకుని పాప దుర్గను పోషించుకుంటూ గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలకు పంపుతుంది. కొన్ని రోజుల క్రితం తండ్రి మరణించగా, శనివారం రాత్రి మనస్థాపంతో తల్లి గంగమని ఆత్మహత్య చేసుకుంది. చిన్నతనంలోనే చిన్నారి దుర్గ (11) నాన్న అమ్మలను కోల్పోవడం, కనీసం అంత్యక్రియలకు కూడా దగ్గరి బంధువులు లేక ఇంటి బయటే ఆ చిన్నారి అనాధగా మిగిలింది. అనాధగా మారిన ఆ బాలిక ప్రస్తుతం తల్లి అంత్యక్రియల కోసం డబ్బులకై, ఇంటి ఎదుట ఓ గుడ్డ వేసుకుని అంత్యక్రియలు సహాయార్థం కోసం ఎదురుచూస్తుంది. సోషల్ మీడియాలో సైతం ఈ ఘటన విన్న సహృదయులు పలువురు ఫోన్ పే ద్వారా సహాయం అందిస్తున్నారు.