బోర్డు కనిపించని బెజ్జూర్ ఎంపీడీవో కార్యాలయం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ ఎంపీడీఓ

Update: 2024-10-30 09:44 GMT

దిశ, బెజ్జూర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ ఎంపీడీఓ కార్యాలయం బోర్డు మీద కార్యాలయం పేరు కనిపించని పరిస్థితి ఉంది. మండల కేంద్రానికి వివిధ అభివృద్ధి పనుల కోసం వచ్చే ప్రజలకు కనీసం కార్యాలయ బోర్డు కనిపించకపోతే ఎలా అని మండల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇది ఎంపీడీవో కార్యాలయమేనా అని అంటున్నారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కార్యాలయ బోర్డు ఏర్పాటు చేయాలని మండల వాసులు కోరుతున్నారు.


Similar News