బెల్లంపల్లిలో 81 శాతం వార్షిక బొగ్గు ఉత్పత్తి: ఏరియా జీఎం దేవేందర్

బెల్లంపల్లి ఏరియాలో 2022-23 ఆర్ధిక సంవత్సరానికి గాను 36 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 29.20 లక్షల టన్నులతో 81శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా మేనేజర్ దేవేందర్ తెలిపారు.

Update: 2023-04-01 14:33 GMT

దిశ, తాండూర్: బెల్లంపల్లి ఏరియాలో 2022-23 ఆర్ధిక సంవత్సరానికి గాను 36 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 29.20 లక్షల టన్నులతో 81శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా మేనేజర్ దేవేందర్ తెలిపారు. గోలేటిలోని తన చాంబర్ లో శనివారం మీడియా సమావేశంలో ఏరియా వార్షిక, మార్చి నెల బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలను జీఎం వెల్లడించారు.

ఏరియాలో గత మార్చి నెలలో 3.90 లక్షల టన్నులకు గాను 4.77 లక్షల టన్నులతో 122 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించమ తెలిపారు. మార్చిలో కైరిగూడ ఓసీపీలో నిర్దేశించిన 3.50 లక్షల టన్నులకు గాను 4.77 లక్షల టన్నులతో 136 శాతం, ఏప్రిల్ 2022 నుంచి మార్చి 2023 వరకు 35 లక్షల టన్నుల గాను 29.20 లక్షల టన్నులతో 83 శాతం బొగ్గు ఉత్పత్తి జరిగిందని తెలిపారు.

ఏరియా నుంచి 2022-23 ఆర్ధిక సంవత్సరానికి 27.71 లక్షల టన్నులు, మార్చిలో 3.64 లక్షల టన్నులు బొగ్గు రవాణా చేశామని తెలిపారు. బొగ్గు ఉత్పత్తికి సహకరించిన అధికారులు కార్మికులకు జీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్వోటూ జీఎం కేహెచ్ఎన్ గుప్తా, డీజీఎం (ఐఈడీ) ఉజ్వల్ కుమార్ బెహారా, పీఎం లక్ష్మణ్ రావు, సీనియర్ పీవో కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News