పాతబస్తీలో మెట్రోకు ముందడుగు

ఎట్టకేలకు హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో నిర్మాణానికి ముందడుగు పడింది.

Update: 2024-08-23 16:14 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఎట్టకేలకు హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో నిర్మాణానికి ముందడుగు పడింది. పాతబస్తీలో మెట్రో నిర్మాణం కోసం భూసేకరణ పనులు జరుగుతున్నాయని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. ఎంజీబీఎస్ నుండి చంద్రాయణగుట్ట వరకు నిర్మించే మెట్రో మార్గంలో భూసేకరణ జరుగుతోంది. ఈ మార్గంలో రోడ్డు విస్తరణ పనులు, స్టేషన్ నిర్మాణాల వల్ల పలు ఆస్తులు సేకరించాల్సి ఉంటుందని తెలిపిన ఎన్వీఎస్ రెడ్డి.. ఇప్పటికీ ఆయా ఆస్తి యాజమనులకు నోటిఫికేషన్ జారీ చేశామని అన్నారు. ఆ నోటిఫికేషన్ పై ఏమైనా అభ్యంతరాలుంటే మెట్రో ఆఫీసులో సంప్రదించాలని కోరారు. అయితే మెట్రో మార్గాలలో అతి సమస్యాత్మకంగా ఉన్న పాతబస్తీ మెట్రో మార్గం నిర్మించడం అంత సులువు కాదని తెలుస్తోంది. ఈ మార్గాలలో ఉన్న ప్రార్థనా మందిరాలు, అతి పురాతన భవనాల యాజమనులు మెట్రో నిర్మాణానికి ప్రధాన అడ్డంకి. గత ప్రభుత్వం కూడా ఈ సమస్యల వలనే పాతబస్తీ మెట్రో మార్గంపై వెనుకడుగు వేసింది. ఇపుడు మెట్రో చేస్తున్న భూసేకరణ విషయంలో కూడా ఇవే సమస్యలు ఎదురు కానున్నాయి. మరి ప్రస్తుత ప్రభుత్వం ఈ సమస్యలను ఎలా అధిగమిస్తుంది అనేది అందరూ ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నారు.      


Similar News