Tinmar Mallanna: 2028లో తెలంగాణకు సీఎం ఎవరో తేల్చేసిన తీన్మార్ మల్లన్న

నెక్స్ట్ సీఎం పై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-22 11:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: 2028 ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీసీ వ్యక్తినే తెలగాణకు కాబోయే ముఖ్యమంత్రి అని ఈ రాష్ట్రం బీసీ రాజ్యంగా మారబోతున్నదని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన అఖిలపక్ష, బీసీ కులసంఘాల రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన, సమగ్ర కులగణనను కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా చేయించే బాధ్యత తనదేనని చెప్పారు. ఒక వేళ అది జరగకపోతే దానికి తాను బాధ్యత వహిస్తానన్నారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలనేది రాహుల్‌గాంధీ ఉద్దేశం అన్నారు.

రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే ఈడబ్ల్యూఎస్ రూపంలో ప్రమాదం ఉందన్నారు. తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ కోటాను ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర జనాభాలో ఓసీల జనాభా 6.98 శాతం మాత్రమేనని తెలిపారు. వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద నూటికి.. ఒకటి లేదా ఒకటిన్నర శాతం మాత్రమే దక్కాలని కానీ 10 శాతం దక్కుతున్నాయన్నారు. మిగతా 9 శాతం రిజర్వేషన్లు బీసీ బిడ్డల నుంచి ఎత్తుకుపోతున్నారని వివరించారు.

తెలంగాణ బాలసంతల కంటే తక్కువ జనాభా ఉన్న వెలమలు 13 మంది ఎమ్మెల్యేలు ఉంటే బాలంతలకు మాత్రం ఇంకా అసెంబ్లీ ఎక్కడుందో తెలియదన్నారు. అనేక నియోజకవర్గాలు ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు అక్కడ ఒక్క బీసీ కూడా ఎమ్మెల్యే కాలేకపోయారన్నారు.


Similar News