Deputy CM : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క‌కు అరుదైన గౌరవం

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క‌కు అరుదైన గౌరవం లభించింది. ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు మెక్సికో దేశంలో న్యూవోలియోన్ లోని మోంటిగ్రో నగరంలో 19వ ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశాలు జరగనున్నాయి.

Update: 2024-09-15 13:03 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క‌కు అరుదైన గౌరవం లభించింది. ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు మెక్సికో దేశంలో న్యూవోలియోన్ లోని మోంటిగ్రో నగరంలో 19వ ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను నిర్వాహకులు తాజాగా ఆహ్వానించారు.

ప్రగతి కోసం శాంతి అనే ప్రధాన అజెండాతో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ 200 వ వేడుకలో నోబెల్ గ్రహీతలు, ప్రపంచ శాంతి న్యాయవాదుల సామూహిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఆహ్వానంలో పేర్కొన్నారు. ఒత్తిడితో కూడిన ప్రపంచ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ, వ్యూహాలను ఈ శిఖరాగ్ర సమావేశంలో రూపొందిస్తామని ఆహ్వాన పత్రికలో వెల్లడించారు.


Similar News