బీఆర్ఎస్ MLA పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

బీఆర్ఎస్ కీలక నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసుల విధులను అడ్డుకున్నారని అడిషనల్ ఎస్పీ రవిచందన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

Update: 2024-09-12 17:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ కీలక నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసుల విధులను అడ్డుకున్నారని అడిషనల్ ఎస్పీ రవిచందన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. కాగా, కౌశిక్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఒకరిపై ఒకరు ఇష్టానుసారం దూషించుకున్నారు. ఈ క్రమంలో కౌశిక్ ఇంటిపై కొందరు టమోటాలు, గుడ్లతో దాడికి తెగబడ్డారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అనంతరం హరీశ్ రావు రంగంలోకి దిగడంతో సీన్ మొత్తం మారిపోయింది. అదే సమయంలో కౌశిక్ రెడ్డి పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.


Similar News