యువతి మృతికేసులో వీడిన మిస్టరీ.. హత్యా?, ఆత్మహత్యా? తేల్చిన పోలీసులు

హైదరాబాద్‌ (Hyderabad)లోని రెడ్ హోటల్లో యువతి మృతికేసును పోలీసులు ఛేదించారు.

Update: 2024-09-19 06:15 GMT

దిశ, శేరిలింగంపల్లి: హైదరాబాద్‌ (Hyderabad)లోని గచ్చిబౌలి రెడ్‌స్టోన్ హోటల్‌(Redstone Hotel)లో యువతి మృతికేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఇది హత్య కాదని, ఆత్మహత్యేనని తేల్చి చెప్పారు. బాధితురాలి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తేల్చారు. ప్రియుడు జీవన్‌ (Jeevan)తో కలిసి శృతి (Sruthi) రెడ్ హోటల్‌ (Red Hotel)కు వెళ్లిందని, అక్కడే ఇద్దరి మధ్య పెళ్లి (Marriage) విషయంలో వాగ్వాదం జరిగిందని తెలిపారు. అయితే తనను పెళ్లి చేసుకోవాలని జీవన్‌పై శృతి ఒత్తిడి చేయగా.. అతడు మాత్రం నిరాకరించడంతో ఆమె మనస్తాపం చెందిందని, చివరికి ఇలా ప్రాణాలు తీసుకుందని పోలీసులు నిర్ధారించారు.

కాగా.. ఈ కేసును పోలీసులు ముందుగా ఆత్మహత్యగా కేసుగానే పరిగణించారు. కానీ కుటుంబసభ్యులు మాత్రం తమ బిడ్డని అత్యాచారం చేసి హత్య చేశారనే ఆరోపణలు చేయడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో శృతిది ఆత్మహత్యేనని తేలింది. ‘‘జడ్చర్లకు చెందిన శృతి (23) గత ఆదివారం హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జన వేడుకలకు చూసేందుకు గాను తన స్నేహితులు మోనా, జీవన్‌ మరో అబ్బాయితో కలిసి వచ్చింది. రెడ్‌స్టోన్ హోటల్‌లో నలుగురూ రెండు గదులు తీసుకున్నారు.

నలుగురూ బీర్ తాగి ఎంజాయ్ చేస్తూ మత్తులో ఉన్న టైంలో జీవన్, శృతి మధ్య పెళ్లి వ్యవహారం చర్చకొచ్చింది. జీవన్‌ పెళ్లికి నిరాకరించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. ఆ తర్వాత జీవన్‌ పక్కనే ఉన్న తన ఫ్రెండ్ గదికి వెళ్లిపోయాడు. మిగిలిన వాళ్లు కూడా బయటకు వెళ్లడంతో గదిలో ఒంటరిగా ఉన్న శృతి క్షణికావేశంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బయటకు వెళ్లిన వారు సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు హోటల్‌కు తిరిగి వచ్చారు. అయితే శృతి ఎంతకీ డోర్‌ తీయకపోవడంతో హోటల్‌ సిబ్బందికి చెప్పి మాస్టర్‌ కీతో ఓపెన్ చేసి లోపలికెళ్లగా.. అప్పటికే శృతి మృతదేహం ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది.’’ అని పోలీసులు పేర్కొన్నారు.


Similar News