Damodara Raja Narsimha : 90 శాతం చికిత్స మండల కేంద్రాల్లోనే జరగాలి : మంత్రి దామోదర రాజనర్సింహ
రోగులకు 90 శాతం చికిత్స మండల కేంద్రాల్లోనే చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Damodara Raja Narsimha) పేర్కొన్నారు.
దిశ, వెబ్ డెస్క్ : రోగులకు 90 శాతం చికిత్స మండల కేంద్రాల్లోనే చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Damodara Raja Narsimha) పేర్కొన్నారు. నేడు మంచిర్యాలలో రూ.360 కోట్లతో ఏర్పాటు చేస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండటం లేదనే మాట రాకుండా పని చేయాలని వైద్యాధికారులకు హితవు పలికారు. రోగులకు 90 శాతం మండల కేంద్రాల్లోని ఆసుపత్రుల్లోనే జరగాలని తెలియ జేశారు. ప్రతి మండలానికి 2 అంబులెన్స్ లు రెడీగా ఉండేలా చూసుకోవాలని, ప్రతి 30 కిమీలకు ఒక ట్రామా సెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu).. ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.