అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వండి.. డీఎస్సీ సాధన సమితి డిమాండ్
2008 డీఎస్సీలో ఉత్తీర్ణులై, సర్టిఫికేషన్ పూర్తి చేసుకున్న తమకు అపాయింట్మెంట్ ఇవ్వాలని డీఎస్సీ 2008 సాధన సమితి సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలను బుధవారం అందజేసింది. కాగా తమకు కూడా అపాయింట్ మెంట్ లెటర్స్ ఇవ్వాలని డీఎస్సీ 2008 సాధన సమితి సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీఎస్సీ 2008లో సెలక్ట్ అయిన తాము ఆయా జిల్లాల్లో డీఈవో కార్యాలయాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తిచేసుకుని ఉన్నట్లుగా చెప్పారు. తమకు కూడా డీఎస్సీ 2024 అభ్యర్థులతో పాటుగా అపాయింట్ మెంట్ లెటర్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.