Telangana: వరదల్లో చిక్కుకున్న 1,662 మంది సేఫ్

భారీ వర్షాలు, వరదలతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కుండపోతగా వర్షాలు పడుతున్నాయి.

Update: 2024-09-02 10:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలు, వరదలతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. పలు గ్రామాలు, కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లకు ఇళ్లకు కొట్టుకుపోయాయి. జన జీవనం స్తంభించిపోయింది. అంతేకాదు.. ఈ వరదల్లో చిక్కుకొని చాలా మంది ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు. మరికొందరు వరదల్లో చిక్కకున్నారు. తాజాగా.. తెలంగాణలో వరదల్లో చిక్కుకున్న 1,662 మంది సురక్షితంగా కాపాడినట్లు ఫైర్, రెస్క్యూసిబ్బంది వెల్లడించింది.

ఖమ్మంలో 761, కోదాడలో 450, ములుగులో 150 మంది, కామారెడ్డిలో 100 మందిని కాపాడినట్లు సిబ్బంది పేర్కొంది. మరోవైపు.. సెప్టెంబర్‌లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. అలాగే వాయువ్య భారతదేశం, దాని పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీర్ఘకాల సగటు వర్షపాతం 167మి.మీలో 109 శాతంగా ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర వివరాలు వెల్లడించారు.


Similar News